జాబ్ మేళా వేదిక సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు
కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియా సహకారంతో ఆదివారం కొత్తగూడెం క్లబ్బులో జరగనున్న మెగా జాబ్ మేళా వేదిక సిద్ధమైంది. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సింగరేణి డైరెక్టర్
కె.వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఇతర డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దాదాపు 65కు పైగా కంపెనీలు తరలివస్తున్నాయని, ఇప్పటికే వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక శ్రద్ద తీసుకుని సింగరేణి యాజమాన్యం సహకారంతో జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీస్థాయిలో జరగనున్న ఈజాబ్ మేళాతో ఈ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, సింగరేణి ఎస్ఓ టు జిఎం కోటిరెడ్డి, ఏజిఎం సివిల్ రామకృష్ణ, డిజిఎం వర్సనల్ మోహన్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ తావుర్య, గుర్తింపు సంఘ నాయకులు వట్టికొండ మల్లిఖార్జునరావు, నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, ఎండి యూసుఫ్, ధర్మరాజు, గుత్తుల శ్రీనివాస్, వంగా వెంకట్, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


