epaper
Sunday, March 1, 2026
epaper

సిరిసిల్ల మున్సిపల్ బ‌రిలో జ‌న‌సేన

సిరిసిల్లలో జనసేన ఎంట్రీ..!
మున్సిపల్ ఎన్నిక‌ల బ‌రిలో పార్టీ అభ్య‌ర్థులు
యువ, చదువుకున్న అభ్యర్థులు పోటీలో
సిరిసిల్లలో 7 – వేములవాడలో 5 వార్డుల్లో పోటీ
ఇంటింటి ప్రచారంతో పెరుగుతున్న మద్దతు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ తొలిసారిగా అడుగుపెట్టింది. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పోటీ చేస్తున్నామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నామని అభ్యర్థులు చెబుతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఏడు వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో ఐదు వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పట్టణాల్లోనూ యువత, విద్యావంతులను బరిలో నిలపడం ద్వారా కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నామని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పోటీకి యువత‌.. చదువుకున్న అభ్యర్థులు

జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఎక్కువగా యువకులు, విద్యావంతులే కావడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతగా మారింది. అనుభవజ్ఞుల రాజకీయాలకంటే సేవాభావం, పారదర్శకత, ప్రజలతో అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని జనసేన నాయకత్వం చెబుతోంది. స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, అవినీతిరహిత పాలన అందించడమే తమ లక్ష్యమని అభ్యర్థులు ఓటర్లకు వివరిస్తున్నారు. “రాజకీయమే కాదు – సేవే మా మార్గం” అనే నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్నారు.
సిరిసిల్ల 15వ వార్డు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న గడ్డం విజయ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంపై పట్టణంలో ప్రత్యేకంగా చర్చ జ‌రుగుతోంది. ఆమె గతంలో మున్సిపల్ కార్మికురాలిగా పని చేశారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన అనుభవంతో, మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. సాధారణ కార్మికురాలిగా మొదలై ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మారాలన్న ఆమె ప్రయత్నం స్థానికంగా జనసేనకు సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది.

విస్తృత ప్రచారం..!

జనసేన అభ్యర్థులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. యువతతో సమావేశాలు, స్థానిక సమస్యలపై చర్చలు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రత్యేకంగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేన వైపు ప్రజలు చూస్తున్నారని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సిరిసిల్ల మున్సిపాలిటీలో 7 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 5 వార్డుల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌రిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాలు, సేవాభావమే తమకు మార్గదర్శకమని జనసేన అభ్యర్థులు చెబుతున్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, ఈ ఎన్నికల ద్వారా సిరిసిల్ల–వేములవాడ ప్రాంతాల్లో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది.

సిరిసిల్ల మున్సిపల్ – జనసేన అభ్యర్థులు

13వ వార్డు – డీకొండ అశోక్
11వ వార్డు – నల్లా ప్రవీణ్
15వ వార్డు – గడ్డం విజయ
25వ వార్డు – దాసరి శేఖర్
26వ వార్డు – అన్నారం సాయి కుమార్
34వ వార్డు – సాగల జీవన్
38వ వార్డు – ఎనగందుల లలిత గణేష్

వేములవాడ మున్సిపల్ – జనసేన అభ్యర్థులు

14వ వార్డు – ఎండీ షాదుల్ల
16వ వార్డు – కొలగరి చందు
17వ వార్డు – అడెల్లి హర్షక్
18వ వార్డు – చింతపంటి సాయికృష్ణ
24వ వార్డు – చింతకింది రాజ్ కుమార్

 

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఏసీపీ విజయ్ కుమార్ గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ కాక‌తీయ‌,...

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సిరిసిల్ల ఎస్పీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img