జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ రాష్ట్రంలోనే ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్
కాకతీయ , కూసుమంచి : రాష్ట్రంలోనే టాప్ టెన్ లో ఒకటి, జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలోనీ పోస్ట్ ఆఫీస్.. పోస్ట్ ఆఫీస్ భవనం రినోవేషన్ చేసి అంకిత భావతో సహకరించినందుకు సర్పంచ్ నలబోతు చంద్రారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు..
బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ సేవలు, సుకన్య సమృద్ధి, ఇంకా 50 రకాల సేవలు పోస్ట్ ఆఫీస్ సేవలు అందుబాటులో ఉన్నాయనీ తెలిపారు.. ఇక్కడ పోస్ట్ ఆఫీసులో అత్యధిక జనాభా పొదుపు చేయడం జన జీవనంలో భాగంగా పొదుపు అలవాట్లు ఉండడం కలిసి వచ్చే అంశమని జిల్లా సూపరింటెండెంట్ తెలిపారు.. గ్రామానికి చెందిన
విష్ణువర్ధన్ రాజు అనే వ్యక్తి పోస్ట్ ఆఫీస్ నందు 550/- ప్రమాద బీమా పాలసీ చేశారు. ఇటీవల ప్రమాదశాస్తు మరణించేయడంతో నామిని అయిన రమాదేవికి 10 లక్షల రూపాయిల చెక్కును ఉమ్మడి ఖమ్మం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ వీరభద్ర స్వామి, ఐపిబి మేనేజర్ రాజేష్, పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఉమ్మడి జక్కేపల్లి సర్పంచుల చేతుల మీదుగా అందించారు.. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్సిల్ పెరుగు నాగేశ్వరరావు, లక్ష్మణ్, పోస్ట్ మాస్టర్ సోమేశ్ కుమార్, సర్పంచ్ లు జక్కేపల్లి నలబోలు చంద్రారెడ్డి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ లక్ష్మయ్య ఉపసర్పంచ్ లు కోటయ్య, నాగరాణి మాజీ పోస్ట్ మాస్టర్ రామిని కృష్ణా రెడ్డి గ్రామపెద్దలు,ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్, మండల పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.


