- చికిత్స పొందుతున్న సూరిని పరామర్శించిన నాయకులు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు జర్నలిస్టును బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరికాదని బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్టాండ్ దగ్గర ప్రమాదకరంగా ఏర్పడిన గుంతను పూడ్చాలని విలేఖరి చదలవాడ సూరి కథనం రాశాడు. ఈ విషయంలో రాజకీయ నాయకుడు బెదిరించడంతో మనస్థాపానికి గురైన విలేకరి సూరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూరిని సోమవారం ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల స్వేచ్ఛను అనగతొక్కాలని చూస్తే సహించేది లేదని అన్నారు. జర్నలిస్టును బెదిరించిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల అధ్యక్షులు బలగం శ్రీధర్, మాలోత్ గాంధీ, గొడుగు శ్రీదర్, మాడ కృష్ణారెడ్డి, టౌన్ జనరల్ సెక్రెటరీ ఆగుళ్ల వీరేశలింగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ ను పట్టుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడంటూ మాట్లాడి బెదిరింపులకు దిగిన కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సూరిని సోమవారం ఆయన పరామర్శించారు. సూరిని బెదిరించిన నాయకుడిపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బట్టు కనకరాజు, చీమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


