బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్‌పై నెట్టడం సరికాదు
– ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌పై మోపొద్దు
– ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఘటనలో కాంగ్రెస్‌కు సంబంధం లేదు
– బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసులు వారి చర్యల ఫలితం
కాకతీయ, గజ్వేల్ : బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కాంగ్రెస్‌పై మోపడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య అన్నారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలో బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో చోటుచేసుకున్న ఘటనకు కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్‌పై నెలకొన్న వ్యతిరేకత కారణంగానే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు జోక్యం చేసుకుని కొందరు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఆ కేసులను కాంగ్రెస్‌పై మోపడం అన్యాయమన్నారు.ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు అవాస్తవ ఆరోపణలు చేయడం బాధాకరమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తున్నారని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ గూగులోతు రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, లష్కర్ రమేష్, కరెళ్ల ప్రవీణ్, చీరబోయిని రమేష్, గౌర స్వామి, కూరాకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


