epaper
Monday, March 2, 2026
epaper

హాస్టల్ పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని

హాస్టల్ పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని
గురుకుల కళాశాలలో కలకలం.. అప్రమత్తమైన సిబ్బంది
సమయానికి చికిత్సతో ప్రాణాపాయం తప్పిన సమీరా
మెరుగైన పరీక్షల కోసం నిమ్స్‌కు తరలింపు

కాకతీయ, బోనకల్ : మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో కలకలం రేపింది. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న తుడుం సమీరా తీవ్ర ఆందోళనకు గురై ఈ ఘటనకు పాల్పడింది. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది వెంటనే స్పందించడంతో ఆమె ప్రాణాపాయం తప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం, ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన తుడుం సమీరా బోనకల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతోంది. ఇటీవల నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. శుక్రవారం ఉదయం క్లాస్ జరుగుతున్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి కళాశాల మూడో అంతస్తుకు వెళ్లి ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో భవనం పై నుంచి దూకింది.

సమయానికి స్పందించిన సిబ్బంది

ఈ ఘటనను గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే స్పందించి సమీరాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. సమీరాకు మరింత సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్ పద్మావతి, పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఇటీవలే విద్యార్థులను ప్రోత్సహిస్తూ పరీక్షలపై అవగాహన కల్పించినప్పటికీ ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img