నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు
కాకతీయ, చింతకాని : నాగులవంచ గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంజూరు చేసిన నిధులతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఈ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు. నూతన స్తంభాల ఏర్పాటు పట్ల స్థానిక విద్యుత్ వినియోగదారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, రామలయం చైర్మన్ నారగాని శ్రీనివాసరావు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కంభం వీరభద్రం, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కంభం శేషయ్య, లైన్మెన్ కిషోర్, జేఎల్ఎం రమేష్, కాంట్రాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


