- మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్
కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ 41వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి లు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రధానిగా ఇందిరాగాంధీ సుస్థిరమైన పరిపాలనను అందించారన్నారు. గరీబ్ హటావో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాలు, అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రపంచంలో మన దేశాన్ని అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకురాలు, సంస్కర్త అని ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.
పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్ గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు యర్రం బాలగంగాధర్ తిలక్, కార్పొరేటర్లు రాపర్తి శరత్, లింగాల రవికుమార్, కొంటెముక్కల నాగేశ్వరరావు, నరాల నరేష్ నాయుడు, గజ్జి సూర్యనారాయణ, చల్లా ప్రతిభారెడ్డి, సుకన్య, అన్నపూర్ణ, భూక్యా సురేష్ నాయక్, గడ్డం వెంకటయ్య, ధోన్ వాన్ వెంకట్రావు, రజ్జీ భాయ్, సాయి కుమార్, వసీం, మహమూద్, నూకారపు వేంకటేశ్వరరావు, ఫజల్, విప్లవకుమార్ పటేల్, ప్రసాద్, నర్సయ్య, బెజ్జం గంగాధర్, జాని తదితరులు పాల్గొన్నారు.


