కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులను పెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా జర్నలిస్టుల యూనియన్ చేస్తున్న కలెక్టరేట్ ముట్టడికి బిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ మద్దతు తెలిపారు. వారితో పాటు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. క్షేత్రస్థాయిలో యూరియా కొరతపై రైతుల అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేసినందుకు ఓ టీవీ ఛానెల్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కేసులు తీసివేయని యెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కల్లోజు శ్రీనివాస్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు డిష్ నాయుడు, దాసరి నాగేశ్వరరావు, సమ్మయ్య గౌడ్, వీరన్న, నవభారత్ ఆనంద్, అక్బర్, గాంధీ, ఆర్కె, తెలంగాణ సురేష్, బట్టు మంజుల, పత్తిపాటి శీను, ఆర్వి రమణ, దాబా శంకర్, రాంబాబు, నరకట్ల రాజశేఖర్, బిఆర్ఎస్వి టౌన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, జగ్గు తండా సేవియా, బొమ్మిడి రమాకాంత్, అచ్చ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


