మీ ప్రాంత ఆడబిడ్డనై వస్తున్నా.. ఆశీర్వ దించండి…
మణుగూరును మరింతగా అభివృద్ధి చేసుకుందాం…
ZPTC స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఆదరించండి…!
ఆఖరిశ్వాస వరకూ మీ కోసమే పని చేస్తా…
ప్రజల రుణం తీర్చుకుంటా…
ఊరురా ప్రగతిని పరుగులు పెట్టిద్దాం…
స్వతంత్ర జడ్పిటిసి అభ్యర్థి పాల్వంచ దుర్గ
కాకతీయ,మణుగూరు…
వచ్చే జడ్పి టిసి ఎన్నికలలో మణుగూరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని,మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ తెలిపారు. సోమవారం సామాజిక కార్యకర్త కర్నెరవి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.మణుగూరు ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలు, కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం సామాజిక కార్యకర్త,న్యాయవాది రవి బలపరి తనను జడ్పిటిసి ఎన్నికలలో ఆదరించాలని, ఆశీర్వదించి గెలిపించాలని, విజ్ఞప్తి చేశారు.మండలాన్ని అన్ని రంగాలలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ప్రజల్ని అభ్యర్థించారు.నాతల్లి నాకు జన్మ నిస్తే మణుగూరు గడ్డ రాజకీయ జన్మనిచ్చిందని,మీ ఆశీర్వాదం,భిక్షతో గతంలో జెడ్పిటిసిగా ఎక్కడా తలవంపులు లేకుండా మీరందరూ గర్వపడేలా పని చేశానని గుర్తు చేశారు.ముఖ్యం గా జడ్పిటిసిగా తనను అలాగే మండలంలోని 11ఎంపీటీసీ స్థానాలకు సామాజిక కార్యకర్త కర్నె రవి బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేసే గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లల కు ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చే స్తామని,ఒంటరి మహిళలు,వితంతు మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించేందుకు కృషి చేస్తామని మణుగూరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మీ బిడ్డలుగా మీ ముందుకు వస్తున్నా జడ్పిటిసిగా తనను ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ఆఖరిశ్వాస వరకూ మీ కోసం అన్ని విధాలా అభివృద్ధి లక్ష్యం గా పని చేస్తామని పాల్వంచ దుర్గ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, కుంజ రాము పాల్గొన్నారు


