epaper
Monday, March 2, 2026
epaper

విధిలో మానవత్వం…

విధిలో మానవత్వం…
డాక్టర్ రాజశేఖర్ గౌడ్‌కు సెల్యూట్!
దారి తప్పిన వయోవృద్ధుడికి ఆపద్బాంధవుడిగా
వైరా అయ్యప్ప స్వామి గుడి వద్ద ఘటన
తక్షణ స్పందనతో 75 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్
108 అంబులెన్స్ సమన్వయంతో వేగవంతమైన చికిత్స

కాకతీయ, ఖమ్మం : విధి నిర్వహణలో ఉన్నా మానవత్వాన్ని మరువని అధికారిగా జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వైరా అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో దారి తప్పి రెండు–మూడు రోజులుగా తిరుగుతున్న సుమారు 75 ఏళ్ల వయోవృద్ధుడిని గమనించి, తక్షణ చర్యలతో అతడి ప్రాణాలను కాపాడారు. వైరా వైపు వెళ్తున్న సమయంలో అక్కడి కిరాణా షాపు నిర్వాహకులు దారి తప్పి తిరుగుతున్న వయోవృద్ధుడి పరిస్థితిని డాక్టర్ రాజశేఖర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. సమాచారం అందగానే ఆలస్యం చేయకుండా ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని వృద్ధుడి పరిస్థితిని పరిశీలించారు. మాట్లాడలేని స్థితిలో, తీవ్ర నీరసంతో ఉన్న వయోవృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన డాక్టర్ వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

అంబులెన్స్ వచ్చేలోపు ఫస్ట్ ఎయిడ్
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అతి వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చేలోపు, అలాగే అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కూడా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్వయంగా ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించడం విశేషంగా నిలిచింది. వయోవృద్ధుడిని తక్షణమే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు ఫోన్ ద్వారా పూర్తి ఆరోగ్య వివరాలు తెలియజేశారు. డాక్టర్ నరేందర్ వెంటనే స్పందించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్ చేయగా, వైద్య బృందం సమన్వయంతో వయోవృద్ధుడికి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసు శాఖకు సమాచారం ఇచ్చి వయోవృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, కుటుంబ సభ్యులు ఎవరు అనే వివరాల సేకరణ కొనసాగుతోంది. గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ చర్యపై ప్రజలు, వైద్య వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
“ఇలాంటి అధికారులే సమాజానికి నిజమైన ఆదర్శం” అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img