epaper
Monday, March 2, 2026
epaper

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి

కాకతీయ, గజ్వేల్ : హోలీ సందర్భంగా గుడ్లు, టమోటాలు వంటి ఆహార పదార్థాలను వృథా చేయవద్దని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి పేర్కొన్నారు. కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత హోలీ జరుపుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. రసాయనిక రంగుల హానికర ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి. పండుగల పేరుతో ఆహారాన్ని వృథా చేయడం సమంజసం కాదు. సురక్షితంగా, బాధ్యతాయుతంగా పండుగలు జరుపుకోవాలి అని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల పూలతో సహజ రంగులు తయారు చేశారు. తయారీ విధానాన్ని వివరించి ప్రదర్శించారు. సృజనాత్మకత కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డా. ఎం. అలివేలు మాట్లాడుతూ హోలీ పండుగ సంప్రదాయ ప్రాముఖ్యతను వివరించారు. పూర్వకాలంలో పూలు, ఔషధ మొక్కలతో తయారు చేసిన సహజ రంగులనే వినియోగించేవారని తెలిపారు. అవి ఆరోగ్యానికి, పర్యావరణానికి హితమని చెప్పారు. రసాయన రంగులు చర్మ సమస్యలు, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయని వివరించారు. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సహజ రంగుల తయారీలో ఉపయోగించే కొన్ని మొక్కల పూలు అలర్జీకి దారితీసే అవకాశముందని తెలిపారు. ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గణపతి, డా. ఎం. అలివేలు, విజయ భాస్కర్ రెడ్డి, డా. ఎం. భావాని, డా. ఎస్. మహేందర్, డా. ఆర్. మహేందర్ రెడ్డి, డా. జ్యోతి, సి.హెచ్. భావాని తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి - హైదరాబాద్ బ్రాండ్‌కు...

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి * చేర్యాల ఎస్సై ని కలిసిన...

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్...

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img