కాకతీయ, అమరావతి: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఇదే సమయంలో హైకోర్టు అనుమతితో తాడిపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లను కలిసి పోలీసుల భద్రతతో తాడిపత్రికి బయలుదేరారు. హైకోర్టు ఆదేశాలతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. ఇరు నేతల పర్యటనల నేపథ్యంలో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రికత్తంగా మారాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు 750మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు పెద్దెత్తున టీడీపీ కార్యకర్తలు ఎదురుగా వెళ్లారు. పుట్లూరు మండలం నారాయణపల్లి వద్ద కేతిరెడ్డిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకున్నాయి.


