epaper
Sunday, March 1, 2026
epaper

కౌజు పిట్టల పెంపకంతో అధిక ఆదాయం

కౌజు పిట్టల పెంపకంతో అధిక ఆదాయం
జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

కాకతీయ, కొత్తగూడెం : గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. ఆదివారం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లక్కీ పౌల్ట్రీ ఫార్మ్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా రైతు నాయుడు ప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం యూనిట్లతో పాటు ఇంక్యులేటర్ (గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి) వ్యవస్థను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఫార్మ్‌లో అనుసరిస్తున్న ఆధునిక పెంపక విధానాలు, మేత తయారీ, ఆరోగ్య సంరక్షణ, శుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా ఇంక్యులేటర్ ద్వారా గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి ప్రక్రియ, ఉష్ణోగ్రత నియంత్రణ, తేమ స్థాయి, హ్యాచింగ్ శాతం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ పౌల్ట్రీ ఫార్మ్ ద్వారా సుమారు 30 వేల కౌజు పిట్టల గుడ్లు, వెయ్యి నాటు కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ఇంక్యులేటర్ సహాయంతో ఆరోగ్యకరమైన పిల్లలను ఉత్పత్తి చేసి మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న రైతులకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.ఈ యూనిట్‌ను మరింత విస్తరించి ఇంక్యులేటర్ సామర్థ్యాన్ని పెంచితే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని కలెక్టర్ సూచించారు. విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని, పౌల్ట్రీ రంగంలో ఈ యూనిట్ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి నమూనా పౌల్ట్రీ యూనిట్లు మరిన్ని ఏర్పాటయ్యేలా రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img