epaper
Monday, March 2, 2026
epaper

మొద‌టి విడ‌త ఎన్నిక‌ల‌కు భారీ భ‌ద్ర‌త‌

మొద‌టి విడ‌త ఎన్నిక‌ల‌కు భారీ భ‌ద్ర‌త‌
2 వేల మంది పోలీసులతో బందోబ‌స్తు
స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలు
953 కేసుల్లో 6403 మంది బైండోవర్
12 లక్షల విలువ చేసే మద్యం సీజ్
16 సరిహద్దు చెక్ పోస్టుల వ‌ద్ద విస్తృత తనిఖీలు
5 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు వేల మందితో భారీగా పోలీసు భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికలలో పోలీసుల విధివిధానాలపై దిశానిర్దేశం చేశామని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ఓటరు పోలింగ్ కు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇప్పటికే మండలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సాయుధ పోలీసు బలగాలను మొహరించినట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, 5 ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా కొనసాగుతోందని, డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే 953 బైండోవర్ కేసుల్లో 6403 మందిని తాహసిల్దార్ ఎదుట హాజరు పరిచామని పేర్కొన్నారు.

జిల్లాలో 184 స‌మ‌స్యాత్మ‌క కేంద్రాలు

జిల్లాలో జరిగే మూడు విడతల పోలింగ్ లో 184 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచే పోలీసుల నిఘా పెంచామని, గ్రామంలో ప్రతి కదలికపై ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తామని, జిల్లా కేంద్రంల” స్పెషల్ బ్రాంచి, ఇతర సిబ్బందితో 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిదంగా జిల్లా వ్యాప్తంగా 16 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుందన్నారు. గ్రామాల్లో అనధికారిక మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకున్న మద్యం గొలుసు దుకాణాలపై దాడులు చేసి 12 లక్షల విలువ చేసే 1200 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో తుపాకులు కలిగిన 86 మంది ఆయుధాలను జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ లో అప్పగించారని తెలిపారు. 207 మంది రౌడీ షీటర్లు 1100 మంది ట్రబుల్ మంగర్స్ పాతనేరస్తులు కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలు జరిగే డివిజన్లలో ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించాని అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆయా ఎన్నికలు జరిగే మండలలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం గ్రామాల వారీగా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

2వేల మంది పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు..!

అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, వసుంధర యాదవ్, శ్రీనివాసులు, మహేష్, సాంబరాజు,సత్యనారాయణ, సర్వర్, సుశీల్ సింగ్, నర్సయ్య తో పాటు సిఐలు, ఆర్ ఐలు, ఎస్సై లు పోలీస్, హోంగార్డ్ సిబ్బంది మొత్తం 2000 మంది బందోబస్త్ లో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img