- చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలపాలు
- ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: మొంథా తుఫాన్ కారణంగా బుధవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలంలో రైతులు కుదేలయ్యారు. పంట చేతికొచ్చే సమయానికి తుఫాను కారణంగా నీటిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా రైతులు విలపిస్తున్నారు. ముఖ్యంగా చేతికి వచ్చిన పత్తి పంట నాశనం అయిందని వాపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు మొలక ఎత్తే మిర్చి కూడా భూమిలోనే కుల్లే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. వరి, పత్తి, మిరప పంటలు తుఫాన్ తో పాటు గాలి వర్షం ముప్పుతో కిందపడిపోవడంతో భారీగా ఆర్దిక నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.


