కాకతీయ, ఖమ్మం టౌన్ : 30 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ తెలిపారు. రఘునాథ పాలెం లోని ఆపిల్ సెంటర్ లో శనివారం వాహన తనిఖీలు ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.30 లక్షల విలువ గల హషీష్ ఆయిల్ (గంజాయి ఆయిల్) లభ్యమైనట్లు తెలిపారు. ఇద్దరిన అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన వైయస్సార్ కాలనీ వాసి కొత్త రాము, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం జిల్లాకు చెందిన శరత్ జానకి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో రఘునాథపాలెం ఎసై గజ్జెల నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.


