హరిహర ఫౌండేషన్ గోడపత్రికల ఆవిష్కరణ
సాంప్రదాయ వేడుకలు అభినందనీయం: మహేష్ కుమార్ గౌడ్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మండల అవతరణ దశాబ్ది ఉత్సవాలు, సంక్రాంతి సంబరాల గోడపత్రికలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. శనివారం ఆయనను అన్నపురెడ్డిపల్లి విద్యావేత్త, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారగాని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని సూచిస్తూ మండల ప్రజలకు ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, కొమరయ్య, సమన్వయకర్త మచ్చ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


