కాకతీయ, బయ్యారం: మండలంలోని ఏజెన్సీ గ్రామాలలో మందు బాబులకు బెల్టు షాపులు సరిపోవు అన్నట్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అడ్డాలుగా చేసుకొని, మద్యం తాగి మందు ఖాళీ బాటిళ్లను పాఠశాల ఆవరణలోనే వదిలి వెళుతున్నారు.
వివరాల్లోనికి వెళితే మండలంలోని భీమ్లా తండా ప్రాథమిక పాఠశాల నందు రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు మద్యం బాటిళ్లను తెచ్చుకొని తాగి, సీసాలను అక్కడే వదిలి వెళ్లారు. మరికొన్ని సీసాలు పగులగొట్టారు. దీనితో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం బడికి వచ్చిన ఉపాధ్యాయులు. విద్యార్థులు మద్యం బాటిళ్లను చూసి విస్తు పోయారు.


