ప్రజలకు భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తుంబూరు దయాకర్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పిస్తూ సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం అందజేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, బోడా మంగీలాల్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, వున్నం రాజశేఖర్, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు భరోసా కల్పించేలా పలు సంక్షేమ చర్యలు చేపట్టిందని, ముఖ్యంగా వైద్య ఖర్చులు భరించలేని పేదల కోసం సీఎంఆర్ఎఫ్ నిధులను వేగంగా అందజేస్తోందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలబడటం…. ఒక్కో కుటుంబానికి నమ్మకం కల్పించడం తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ సహాయం పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు.


