epaper
Sunday, March 1, 2026
epaper

విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం

విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం
హామీల‌ను నిల‌బెట్టుకోని ప్ర‌భుత్వం
తుంగ‌తుర్తిలో ఎక్క‌డా చూసినా స‌మ‌స్య‌లే
తుంగతుర్తిలో ‘జనం బాట’ లో క‌విత విమ‌ర్శ‌లు
రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారని ఎద్దేవా
హామీల అమలుకు పిడికిలెత్తాలంటూ పిలుపు

కాకతీయ, తుంగతుర్తి : విద్య‌, వైద్యం అందించ‌డంలో రేవంత్ స‌ర్కారు విఫ‌ల‌మ‌వుతోంద‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌విత విమ‌ర్శించారు. సూర్య‌పేట జిల్లా తుంగ‌తుర్తిలో శ‌నివారం జ‌రిగిన జ‌నంబాట కార్య‌క్ర‌మంలో క‌విత పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్‌కల్‌లో తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా క‌విత‌కు ఘన స్వాగతం లభించింది. ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తిలో పర్యటిస్తున్న కవిత ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.

హామీల అమ‌లేది..?!
తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తే పాడుపడ్డ కాల్వలు, నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని కవిత విమర్శించారు. 100 పడకల హాస్పిటల్, రుద్రమ చెరువు అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. 2018 నుంచి తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం సాగుతూనే ఉందని, గత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప పురోగతి లేదన్నారు. గ‌త ప్రభుత్వంలో నాలుగేళ్లు, ప్రస్తుత ప్రభుత్వంలో రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రికి మూడున్నర లక్షల మంది ప్రజలు వస్తున్నారని సిబ్బందే చెబుతున్నారని, సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలకు రెండు డెలివరీలు మాత్రమే జరుగుతున్న పరిస్థితి ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లాల్సి వస్తోందన్నారు.

హామీల అమలుకు పోరాటం
హాస్పిటల్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నిస్తే బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడని, విద్య–వైద్యాలపై ఖర్చు చేయని ప్రభుత్వం మరెందుకు ఖర్చు చేస్తోందని నిలదీశారు. పెన్షన్లు పెంచుతామని, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతుబంధు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. ప్రజలు గట్టిగా నిలదీయకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓట్లు లేవని, ఓట్లు అడగటానికి తాను రాలేదని స్పష్టం చేసిన కవిత… పదేళ్లు, పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు చేయించేందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నామని తెలిపారు. ప్రజలను ఓట్లు వేసే మెషీన్లుగా చూసే సంస్కృతి పోవాలని, కొత్త రాజకీయ పంథా రావాలని ఆకాంక్షించారు.
సూర్యాపేట జిల్లా అంటేనే చైతన్యానికి ప్రతీక అని, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, మారోజు వీరన్న వంటి మహనీయులను కన్న నేల ఇదని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో సమాజంలోని అట్టడుగు వర్గాలు, మహిళలు, యువత కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల పట్ల తనకు ప్రత్యేక పక్షపాతం ఉందని, వారికి విద్య–వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండాలని కోరుకుంటానన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల భూమి, రూ.25 వేల పెన్షన్ అందే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రభుత్వ భూములపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నూతన్‌కల్ ప్రజలు చెప్పిన అన్ని సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, ఎండను లెక్కచేయకుండా ఘన స్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర...

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11...

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు కలెక్టర్‌, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న...

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కార్యకర్తలంతా ఐక్యంగా...

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి...

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ కాకతీయ, తుంగతుర్తి : తెలంగాణ క్రీడ...

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ ఇంటిలో, కార్యాలయంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img