epaper
Sunday, March 1, 2026
epaper

సీతానాగారం గిరిజన హాస్టల్‌లో గోల్‌మాల్‌!

సీతానాగారం గిరిజన ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో గోల్‌మాల్‌!
వార్డెన్ ఇష్టారాజ్యం… పిల్లల భవితకు ముప్పు
సెలవుల్లేకున్నా ముందస్తుగా విద్యార్థులను ఇళ్లకు పంపింపు
హాస్టల్‌లో లేనప్పటికీ రికార్డుల్లో ఉన్నట్లే నమోదు
వారానికి ఒకటి–రెండు రోజులు మాత్రమే విధుల్లో వార్డెన్
తప్పిదాల పేరుతో విద్యార్థుల నుంచి ఫైన్ల వసూళ్లు

కాకతీయ, నిఘా ప్ర‌తినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానాగారం గిరిజన సంక్షేమ ఆశ్ర‌మ బాలుర పాఠ‌శాల‌లో  తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.హాస్టల్ వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చులు మిగిల్చుకునే ఉద్దేశంతో సెలవులు లేకున్నా ముందుగానే విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే, వాస్తవానికి పిల్లలు హాస్టల్‌లో లేనప్పటికీ రికార్డుల్లో మాత్రం విద్యార్థులు ఉన్నట్లే నమోదు చేస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని స్ప‌ష్ట‌మైన ఆధారాలు కాక‌తీయ‌కు చిక్కాయి.

విధుల్లో అరుదుగా… నిర్వహణ వాచ్‌మెన్ చేతుల్లో?

హాస్టల్‌కు వార్డెన్ వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే హాజరవుతున్నారని, మిగతా రోజుల్లో హాస్టల్ నిర్వహణ బాధ్యతలన్నింటినీ వాచ్‌మెన్‌, ఇతర సిబ్బందికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లోపంతో హాస్టల్‌లో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ హాస్టల్‌లో నిర్దేశిత మెనూను అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెలకు నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే గుడ్లు పెడుతున్నారని, పోషకాహారం పేరుకే పరిమితమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు అందాల్సిన ఆహారం కోతకు గురవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫైన్ల భారం… విద్యార్థులపై మానసిక ఒత్తిడి

హాస్టల్ వార్డెన్‌తో పాటు సంబంధిత హెడ్‌మాస్టర్ విద్యను వ్యాపారంగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల వద్ద వివిధ కారణాలు చూపిస్తూ ఫైన్లు వసూలు చేసే బాధ్యతను ఓ ఉపాధ్యాయుడు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నాడని సమాచారం. ఈ పరిస్థితుల కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనలతో భయపడిన పలువురు తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకెళ్లి టీసీలు రిటర్న్ చేసుకున్నారని తెలుస్తోంది. ఫలితంగా హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సమాచారం. ఇన్ని ఆరోపణలు, సమస్యలు ఉన్నప్పటికీ హాస్టల్‌కు సంబంధిత హెడ్‌మాస్టర్ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పిల్లల భద్రత, సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img