గాంధీ పేరు మార్పు సహించేది లేదు”
జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పసుమర్తి సీతా చంద్రరావు
గాంధీచౌక్‌లో ఆర్యవైశ్య సంఘం నిరసన
కాకతీయ, ఖమ్మం టౌన్ : మహాత్మా గాంధీ పేరు మార్పును ఏ పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీచౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించి, అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పసుమర్తి సీతా చంద్రరావు మాట్లాడుతూ.. గాంధీకి జరిగిన అవమానాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తోందని, పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. వినతిపత్రాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పంపుతామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుమ్మడవల్లి శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురివెళ్ల ప్రవీణ్ కుమార్, జిల్లా, నగర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.


