కాకతీయ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నముఠాను తెలంగాణ పోలీస్ ప్రత్యేక దళం ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నిందితుల దగ్గరి నుంచి 1.15 కిలోల గంజాయి, 45గ్రాముల ఓజీ వీడ్ తోపాటు ప్యాకింగ్ సామగ్రి, డిజిటల్ తూకంయంత్రం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూరారం, జీడిమెట్ల, మహింద్రయూనివర్సిటీ దగ్గర దాడులునిర్వహించి విద్యార్థులు మహ్మద్ అషార్ జావీద్ ఖాన్, నేవీల్ టాంక్ బ్రామ్ తో పాటుజీడిమెట్లకు చెందిన అంబటి గణేశ్, శివకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల ఫోన్లు పరిశీలించిన పోలీసులకు దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలు దారుల సమాచారం లభించింది. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లో సేకరించిన సమాచారం మేరకు ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.


