భక్తాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠకు శంకుస్థాపన
పాల్గొన్న మేయర్ పునుకొల్లు నీరజ
ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయంగా రూ. 20 వేలు అందజేత
ఉదయం నుండి అర్చకుల మంత్రోచ్ఛరణ మధ్య కొనసాగుతున్న పునః ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయానికి పునః ప్రతిష్ట,శంకుస్థాపనలు ఆ ఆలయ కమిటీ చైర్మన్ కోన చంద్రశేఖర్ చేశారు. ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు పూనుకున్న ప్రధాన అర్చకులు హరీష్ గురువారం వేద మంత్రాలు చదివి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ పునుకొల్లు నీరజ హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి రూ.20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భక్తులు ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలని తమకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని కోరారు. భక్తాంజనేయ స్వామి దేవాలయం పురాతన దేవాలయం అని ఇటువంటి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితులు యుగేందర్, వడ్డబోయిన శంకర్, వడ్డబోయిన నరసింహారావు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


