కరీంనగర్‌లో డయాగ్నొస్టిక్ సెంటర్, వెజ్ రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ మేయర్ సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్, సివిల్ హాస్పిటల్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వి ఎం డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ సెంటర్‌ను మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఆధునిక వైద్య పరికరాలతో ప్రజలకు ఖచ్చితమైన నిర్ధారణ సేవలు అందించేందుకు సెంటర్ సిద్ధంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. వైద్య సేవల విస్తరణలో ఇది మరో మైలురాయి అని పేర్కొన్నారు.ఇక కమాన్ చౌరస్తా వద్ద ప్రారంభించిన సురభి ఉడిపి వెజ్ రెస్టారెంట్‌ను యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ అనూప్ కుమార్ కలిసి ప్రారంభించారు. శుభ్రమైన వాతావరణంలో ఉత్తమ నాణ్యమైన వెజిటేరియన్ వంటకాలను అందించేందుకు రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు యాజమాన్యం వెల్లడించింది. స్థానికులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.



