- గంధంపల్లి పశువైద్యాధికారి బానోత్ లక్ష్మి.
కాకతీయ, బయ్యారం : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బయ్యారం మండలం గంధంపల్లి పశువైద్యాధికారి బానోత్ లక్ష్మి తెలిపారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గాలికుంటు వ్యాధి నివారణకు పశువుల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నాలుగు నెలల వయసు దాటిన దూడలకు,పెద్ద పశువులకు ఏడాదికి రెండుసార్లు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి వేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది బి.వినోద, గోపాలమిత్ర ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


