మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కేడిక వెంకట్ రెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం విధితమే. కాగా మృతుడి కుటుంబాన్ని రాంపూర్ గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్యతో పాటు పలువురు నాయకులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.50 కిలోల బియాన్ని అందజేశారు. పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య, కుర్మ సంఘం మండల అధ్యక్షులు షేవల్ల రాజయ్య, రంగు రాజమౌళి, బండారి అంజయ్య, మంతెన అంజిరెడ్డి, షేవల్ల లక్ష్మణ్, రంగు సత్తయ్య, శెట్టి బీరయ్య, బండారి కిష్టయ్య, ముప్పారపు తిరుపతి, మంతెన హన్మరెడ్డి తదితరులు ఉన్నారు.


