కాకతీయ ,బయ్యారం: మండలంలోని రైతులకు యూరియా సరఫరా కాకపోవడంతో గురువారం సొసైటీ ఎదురుగా ఉన్న ఇల్లందు, మహబుబాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. రైతు బతకాలంటే యూరియా కావాలంటూ ..మొక్కజొన్న బతకాలంటే యూరియా కావాలంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు అందిస్తూ ధర్నా నిర్వహించారు.
ధర్నాను విరమింప చేసేందుకు ఎస్సై తిరుపతి రైతులకు ఎంత నచ్చ చెప్పినప్పటికీ గంటపాటు రోడ్డుపైనే రైతులు నిరసన వ్యక్తం చేయడంతో, రోడ్డుపై అటు ఇటు వైపుగా వెళ్లే వాహనాలు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. యూరియా వెంటనే రైతులకు పంపిణీ చేయాలని, తమ పంటలను కాపాడాలని ఎస్సైని రైతులు వేడుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ రైతులకు యూరియా వచ్చే విధంగా కృషి చేస్తానని ధర్నా విరమింప చేయమని, పలుమార్లు వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బయ్యారం , ఇర్సులాలాపురం,వెంకట్రాం పురం , రైతుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


