విద్య టెక్నో కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఫేర్‌వెల్ డే
విద్యార్థులు చదువుతోపాటు మంచి అలవాట్లు అలవరుచు కోవాలి…
కరస్పాండెంట్స్ పుచ్చకాయల శంకర్,బద్దం శ్రీనివాస్ రెడ్డి…
కాకతీయ,మణుగూరు : శ్రీ విద్య టెక్నో కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.కళాశాల ప్రాంగణం రంగురంగుల అలంకరణలతో కళకళలాడగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సాదర వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్లు పుచ్చకాయల శంకర్,బద్దం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.వారు మాట్లాడుతూ,విద్యార్థులు చదువుతోపాటు మంచి అలవాట్లు అలవర్చుకోవాలని,క్రమశిక్షణ, సమయపాలన,గురువుల పట్ల గౌరవం వంటి విలువలు జీవితం లో ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.నృత్యాలు, పాటలు,స్కిట్లతో అందరినీ అలరించారు. చివరగా జ్ఞాపికల ప్రదానం చేసి,భావోద్వేగ వాతావరణంలో కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ సారంగపాణి
కళాశాల అధ్యాపకులు,సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


