ఖమ్మంలో నకిలీ బంగారంతో బురిడి
బంగారం అమ్ముతామంటూ వచ్చే వారిని నమ్మకండి
ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్ బాబు
నిందితుల ఫొటోలను మీడియాకు రిలీజ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దొరికిన బంగారం, బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి నకిలీ బంగారంతో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం త్రీ టౌన్ సి ఐ మెహన్ బాబు తెలిపారు. పథకం ప్రకారం ఓ అపరిచిత మహిళ ముందు వెళ్తూ ఆమె చేతిలోని ప్యాకెట్ జారవిడిచి ఆపై ఆమే ప్యాకెట్ తెరిచి బంగారు బిస్కెట్ దొరికిందని చెబుతుండగా మరో వ్యక్తి వచ్చి బంగారు బిస్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని నమ్మిస్తారని తెలిపారు.

ఇదంతా నిజమేనని నమ్మిన ఓ మహిళ తన వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, రూ.10వేల నగదును అపరిచిత మహిళకు ఇవ్వడమే కాక మిగతా నగదు తెచ్చి ఇస్తానని చెప్పి మోస పోయిందని, ఇందుకు సంబంధించి బాధితురాలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు నిందితుల ఫొటోలను సీఐ మీడియాకు విడుదల చేశారు. ఫోటోలోని నిందుతులు ఎక్కడైనా కనిపిస్తే ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712659115, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


