పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
కాకతీయ, అమరావతి : బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొన్నారు.


