కవిత పర్యటనకు విపరీత స్పందన
ప్రజా ప్రేమ తట్టుకోలేక ఫ్లెక్సీలు కూల్చిన కాంగ్రెస్ నేతలు
గుంజపడుగు హరిప్రసాద్
కాకతీయ, కరీంనగర్ : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ యాత్రకు ఊహించని స్థాయిలో ప్రజా మద్దతు వెల్లువెత్తుతుందని, అదే భయంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మండిపడ్డారు.నల్గొండ పట్టణంలో జాగృతి ఆధ్వర్యంలో కవిత పర్యటనకు స్వాగతంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించడం ప్రజా మద్దతుపై భయానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రతి జిల్లాలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, గత ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్న కవితక్కకు ప్రజల ఆదరణ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఈ ప్రజా స్పందన చూసి నల్గొండ జిల్లా మంత్రుల కనుసన్నల్లో మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు అని హరిప్రసాద్ అన్నారు.ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన కవితక్క ప్రజల మనస్సులో ఏర్పడిన స్థానాన్ని ఎవరూ చెరిపివేయలేరు. ఇరవై ఏళ్లుగా ప్రజలతో గుండెల్లో గుండె కలిపిన నాయకురాలు కవిత అని ఆయన స్పష్టం చేశారు.


