జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ ఆరో తేదీని బ్లాక్ డేగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ హోటల్స్ దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాలు, చారిత్రక కట్టడాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్లాక్ డే సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా పెట్టారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకుంన్నారు.


