నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ దాడులు
10 లీటర్ల సారా, స్కూటీ స్వాధీనం
కాకతీయ, కూసుమంచి : నాటుసారాను తయారు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న మహిళపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నేలకొండపల్లి ఎక్సైజ్ సిబ్బంది పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 10 లీటర్ల నాటుసారా, స్కూటీ, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన దారవత్ పార్వతి కొంతకాలంగా నాటుసారా తయారు చేస్తూ అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే నాటుసారాకు అవసరమైన బెల్లం సరఫరా చేస్తున్న సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన శ్రీరంగం వెంకటరమణపై కూడా కేసు నమోదు చేశారు. వెంకటరమణ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ సుంకరి రమేష్, ఎస్సై లత, సిబ్బంది శ్రీనివాస్, సంపూర్ణ, బలరాం, వినీత్ పాల్గొన్నారు.


