నల్లబెల్లం మాఫియాపై ఎక్సైజ్ దాడులు!
కోక్యాతండా వద్ద అక్రమ రవాణా గుట్టురట్టు
రూ.2 లక్షల విలువైన నల్లబెల్లం స్వాధీనం
అక్రమ రవాణాకు వాడిన ఆటో సీజ్
ముగ్గురిపై కేసు నమోదు
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం కోక్యాతండా గ్రామం సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న నల్లబెల్లం, పట్టిక, నాటుసారాను ఎక్సైజ్ పోలీసులు భారీగా పట్టుకున్నారు. నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో సుమారు రూ.2 లక్షల విలువైన నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
గత రాత్రి నాయకన్‌గూడెం, కోక్యాతండా గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న నల్లబెల్లం, పట్టిక, నాటుసారాను గుర్తించి పట్టుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన వంకాయల జనార్దన్, నాంపల్లి ధనలక్ష్మి, కోక్యాతండా గ్రామానికి చెందిన భానోత్ నరేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నల్లబెల్లం, నాటుసారా అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటూ, ఇలాంటి చర్యలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.


