epaper
Thursday, January 15, 2026
epaper

సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు

సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు
లక్కీ డ్రా లో మద్యం దుకాణాలు వచ్చింది కొందరికే
మరో మూడు సంవత్సరాలు పాత వారిదే హవా
కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి శాఖపై పెత్తనం
గతంతో పోల్చుకుంటే కొత్త వారికే ఎక్కువ దుకాణాలు
రెండు సిండికేట్లు వారికే ఆ శాఖలో ప్రాధాన్యం
నిబంధనలు పాటించకపోయిన డబ్బులు ఇస్తే సరి

కాకతీయ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లాల్లో మద్యం దుకాణాల యజమానులు సిండికేట్లుగా ఏర్పడి ఎక్సైజ్ శాఖ అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత పదేళ్ల ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రోహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే లక్కీ డ్రా లాటరికి రెండు సంవత్సరాల కాలపరిమితికి గాను రెండు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దుకాణాల యజమానులు ప్రతి ఏటా నిర్వహించే లక్కీ డ్రా లో రెండు ప్రధాన సిండికేట్లుగా ఏర్పడి కొత్తవారికి చోటు ఇవ్వకుండా వారే ఏళ్ల తరబడి దుకాణాలలో తిష్ట వేసి కూర్చునేవారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో దుకాణాలకు కాల పరిమితి పెంచి మూడు సంవత్సరాలుగాను మూడు లక్షల చలానా రుసుము కేటాయించడం జరిగింది. అయినా సిండికేట్ గా ఏర్పడ్డ దుకాణాల యజమానులు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారుల సహకారంతో ఏళ్లకు తరబడి పాతుకుపోయి ఎక్కువ దుకాణాలకు టెండర్లు వేసి కొత్త వారికి చోటు ఇవ్వకుండా ప్రయత్నం జరిపినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

కోట్ల డబ్బు ఆశ చూపి… మళ్ళీ…

లక్కి డ్రా ద్వారా కొత్త గా గెలుచుకున్న దుకాణా దారుల వద్ద నుంచి సిండికేట్ దారులు కోట్ల డబ్బు ఆశ చూపి మళ్ళీ వాళ్ళ షాపులను వాళ్ళే కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి . ప్రధానంగా రెండు సిండికేట్లుగా ఏర్పడ్డ దుకాణ యజమానులు పెద్ద ఎత్తున మద్యం దుకాణాలకు టెండర్లు వేసి కొత్తవారికి తావివ్వకుండా వారే నడిపించాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లు అయింది. దీంతో చేసేది ఏమీ లేక సిండికేట్ వ్యాపారులు ఏకంగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారులను కొనుగోలు చేసి వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల మార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 116 దుకాణాలకు సుమారు 4వేల కు పైగా దరఖాస్తు లు చేసుకున్న వారిలో సగానికిపైగా సిండికేట్ వ్యాపారుల ఉండటం గమనార్హం. అయితే ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు కావడంతో పక్క రాష్ట్రం నుండి ఓ కీలక మద్యం వ్యాపారి అత్యధికంగా 700 మద్యం దుకాణాలకు సిండికేట్ ద్వారా దరఖాస్తు0లు చేసుకొని కేవలం 19 దుకాణాలే గెలుచుకున్నట్లు సమాచారం. మరో సిండికేట్ వ్యాపారులు 100కు పైగా దరఖాస్తులు చేసుకొని వారు కేవలం 9 షాపులు కైవసం చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే సిండికేటర్లకు 116 షాపులు గాను 28 మాత్రమే లక్కీ డ్రా లో గెలుచుకున్నారు. అయితే మిగిలిన వాటిలో కూడా పాతవారు ఉన్నప్పటికీ వారు సిండికేట్ లో లేకపోవడం కొత్త వారికి అత్యధికంగా దుకాణాలు రావడం సిండికేట్ వ్యాపారులకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు.

సిండికేట్లు చెప్పినట్లే చేయాలి…

జిల్లాలో రెండు సిండికేట్లుగా ఏర్పడ్డ వ్యాపారులు కొత్త వారిపై పెత్తనం చేస్తూ వారు నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలంటూ హుకుం జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. అంతేకాక ప్రతి మద్యం దుకాణం పరిధిలో బెల్టు షాపులను ఏర్పాటు చేసుకొని కౌంటర్లో అమ్మే ధర కంటే పది రూపాయలు ఎక్కువ కు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొత్త దుకాణదారుడు మద్యం అమ్మాలంటే వాళ్ళు చెప్పిన రేట్లకే అమ్మకం జరపాలి లేదంటే ఎక్సైజ్ అధికారులకు తప్పుడు సమాచారాలు అందజేస్తూ వారిపై బెదిరింపులకు పాల్పడతారని బాధిత దుకాణదారులు వాపోతున్నారు. సిండికేట్ లో లేని వ్యాపారులకు చుక్కలు చూపిస్తూ ఎక్సైజ్ అధికారులను ఉపయోగించుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సిండికేట్ వ్యవస్థ పై ఉక్కు పాదం మోపాల్సిన ఎక్సైజ్ అధికారులు వారి మామూళ్ల మత్తులో తూగుతూ కొత్త దుకాణదారులకు లేనిపోని ఆంక్షలు పేరుతో వారిని అందరూ కాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రతినెల వారు చెప్పినంత కొత్త దుకాణా దారులు ఎక్సైజ్ అధికారులకు మామూలు ముట్ట చెప్పకపోతే ఇష్ట రీతిగా పెనాల్టీ పేరుతో దండుకుంటారని షాపుల యజమానులు చెప్పుకొస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img