కేసీఆర్ పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం
క్రైస్తవులుకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
: ఎంపీ వద్దిరాజు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర క్రిస్టియన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, శాంతి, కరుణ విలువలు నేటికీ ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం లభించిందని, మైనారిటీల సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. గురుకులాల ద్వారా ఉచిత నాణ్యమైన విద్య, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల రూపంలో విదేశీ విద్యకు రూ.20 లక్షల సహాయం అందించారని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనా స్థలాల మరమ్మత్తులు, పేదలకు నూతన దుస్తులు, సామూహిక విందులు నిర్వహించేవారని చెప్పారు. ఈ పండుగను కుటుంబ సభ్యులతో భక్తి, శాంతి వాతావరణంలో జరుపుకోవాలని కోరుతూ క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.


