ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రొత్సాహం
కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెంలోని త్రీ ఇంక్లైన్, ధన్బాద్ గ్రామ పంచాయతీలకు చెందిన క్రీడాకారులు
లికిత్ చరణ్, సాయి శృతి, శరణ్యలు రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కొత్తగూడెంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పలు విభాగాలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన లిఖిత్ చరణ్ 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, సాయి శృతి 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, శరణ్య 46 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుపొందడం ద్వారా జిల్లా జట్టులో స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు వీరు అర్హత సాధించారు. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను శనివారం కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో సైతం మంచి ప్రతిభ కనబరిచి పతకాలు గెలుపొంది మన జిల్లా కీర్తిని చాటాలని ప్రతి ఒక్కరు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని ప్రతిభవంతులైన క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడూ అందిస్తామని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, రెజ్లింగ్ జాతీయ క్రీడాకారిణి నిహారిక తదితరులు పాల్గొన్నారు.


