ఎన్నికల నిబంధనలు పాటించాలి
కాకతీయ, చేర్యాల : ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం పేర్కొన్నారు. చేర్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల జాతీయ రహదారి మీదుగా అలానే పలు కాలనీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ప్రజలకు, స్థానిక ప్రతినిధులకు వివరించారు. అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సీఐ బానోత్ రమేష్, ఎస్ఐలు వేముల నవీన్, మహేష్, మానస, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


