అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య
కాకతీయ, కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామానికి చెందిన మల్లెంపాటి రంగయ్య (70) ఆరోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్న ఆయన, ఇంట్లో ఎవరికీ తెలియకుండా పక్కనే ఉన్న రావిచెట్టుకు తాడుతో ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం భర్త కనిపించకపోవడంతో భార్య వెతకగా విషయం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


