కాకతీయ, పినపాక: ఉపాధి హామీ పని పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించిందని పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పినపాక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఉపాధి హామీ కార్మికులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలు ఆదాయ ఆర్జనకు ఉపయోగపడుతుందన్నారు. ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, ఎంపీడీవో సునీల్ కుమార్, తాహసీల్దార్ గోపాలకృష్ణ, అగ్రికల్చర్ ఏవో వెంకటేశ్వర్లు, పినపాక పీహెచ్సీ వైద్యులు మధు, అటవీ అధికారి వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ గుమ్మడి వినీత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు గోగ్గల నాగేశ్వరరావు, తోలం కల్యాణి, నాయకులు కొర్సా ఆనంద్, బషీరుద్దీన్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, ఉడుముల లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాల్గొన్నారు.


