పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
పార్టీ నేతలకు కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పిలుపు
నగరంలోని పలు డివిజన్లలో పర్యటన..
మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్‌కు సత్కారం
కాకతీయ, ఖమ్మం టౌన్ : పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు కృషి చేయాలని ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన నాగండ్ల దీపక్ చౌదరి సోమవారం ఉదయం నగరంలోని మూడవ పట్టణ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ మరింత బలం పుంజుకునేల చర్యలు చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో పర్యటించిన దీపక్ చౌదరి పార్టీ బలోపేతంపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులను, ముఖ్య కార్యకర్తలను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్ ను తన ఇంటికి వెళ్లి పలకరించి ఆయనను శాలువతో సత్కరించారు. అనంతరం పార్టీ విధి విధానాలపై చర్చించి మూడో పట్టణ ప్రాంతంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ పట్టణ అధ్యక్షుడు నరాలు నరేష్,48 డివిజన్ నాయకులుఅల్లే సాయికిరణ్, 33 డివిజన్ నాయకులు కరాటే సైదులు. అరవింద్ రెడ్డి ,సాయి, గుడి చుట్టూ మధు, తాళ్లూరి రాజేష్ పలువురు పాల్గొన్నారు.


