మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి
* లయన్స్ క్లబ్ మహిళా సభ్యులు
* బాధ్యతలు స్వీకరించిన చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ కు సన్మానం
కాకతీయ,చేర్యాల:చేర్యాల మున్సిపాలిటీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ , వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని చేర్యాల లైన్స్ క్లబ్ మహిళా సభ్యులు ఆకాంక్షించారు. చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ , వైస్ చైర్ పర్సన్ మేడిశెట్టి ఉమా ను లయన్స్ క్లబ్ మహిళా సభ్యులతో కలిసి బుధవారం చేర్యాల పట్టణంలోని దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ , కౌన్సిలర్లకు లయన్స్ క్లబ్ మహిళా సభ్యులు శుభాకాంక్షలు తెలిపి పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు అధికారం అప్పగించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని దీపాంజలి సూచించారు. ఈ కార్యక్రమంలో, లయన్స్ క్లబ్ సభ్యులు, చెరుకు దీపాంజలి,గంజి జ్యోతి, గంపల మహేశ్వరి, పుర్మ కరుణ, ఆకుల భాగ్యలక్ష్మి, కొండలక్ష్మి, బచ్చు ఆండాలు, ఈ. శోభారాణి, కొక్కుల అరుణ తదితరులు పాల్గొన్నారు.


