కాకతీయ, పినపాక : మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా ముందస్తు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినీలు వివిధ రంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కోలాటం, నృత్యాలు చేశారు. విద్యార్థులకు బతుకమ్మ, దసరా పండుగల విశిష్టతను ఉపాధ్యాయులు తెలియజేశారు. 21 నుంచి అక్టోబర్ 3వరకు ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినందున ఈ సంబరాలు జరుపుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు కె రమణ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామిరెడ్డి, రాంబాబు, కేశవరావు, గాంధీ, విద్యార్థులు పాల్గొన్నారు.


