శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం
ఆచార్యుడిగా పనిచేసిన నాయిని చంద్రయ్య ఉదారత
కాకతీయ, కరీంనగర్ : శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం గతంలో ఆచార్యుడిగా పనిచేసిన నాయిని చంద్రయ్య రూ.1,16,000 విరాళాన్ని అందజేశారు. తన తల్లిదండ్రులు నాయిని ఆగయ్య,లక్ష్మి జ్ఞాపకార్థంగా ఈ విరాళాన్ని పాఠశాల ప్రధానాచార్యుడు సముద్రాల రాజమౌళికి అందించారు.సరస్వతీ శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేయడం తన జీవితానికి దిశానిర్దేశం చేసిందని నాయిని చంద్రయ్య తెలిపారు. ఈ పాఠశాల తనను అన్ని రంగాల్లో ముందుకు నడిపిందని పేర్కొంటూ,కృతజ్ఞతాభావంతో పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సమితి అధ్యక్షుడు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, తాటి రాజేశ్వర్ రావు, రాపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నాయిని చంద్రయ్యను అభినందించారు.


