ధ్వజస్తంభ ఏర్పాటుకు విరాళం అందజేత..
కాకతీయ,గీసుగొండ : శివరామ క్షేత్రంలో ధ్వజస్తంభ నిర్మాణం కోసం రూ.1,50,000/- విరాళం అందజేశారు.మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామ శివరామ క్షేత్రంలో అభివృద్ధి పనులలో భాగంగా ధ్వజస్తంభ నిర్మాణం కోసం గీసుగొండ తాజా సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ రూ.1,50,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, శివరామ క్షేత్రాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో శివరామ క్షేత్ర అధ్యక్షుడు గడ్డి అశోక్, ప్రధాన కార్యదర్శి నరేందర్, కార్యదర్శి జన్నారపు రాజేష్,గ్రామ పెద్దలు కాటి సుందరయ్య,నూతన సర్పంచ్ పోగుల యుగేందర్,జన్నారపు రామ్ రెడ్డి,జన్నారపు నాగరాజు,గడ్డి రామరాజు,భాస్కర్, కొత్తపల్లి నరేష్,పండుగ జైపాల్,తుమ్మలపల్లి రవి,గంప రవి,సాంబయ్య,రమేష్, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ధ్వజస్తంభ ఏర్పాటుకు విరాళం అందజేత..
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


