- కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలో సీపీ ఉత్తర్వుల మేరకు ఏసీపీ ట్రాఫిక్ పర్యవేక్షణలో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించామని సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపారు. శని, ఆదివారం కలిపి 61 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, అక్టోబర్ లో మొత్తం 466 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 128 రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోడీఫైడ్ సైలెన్సర్స్ మార్చడం జరిగిందని చెప్పారు. కావున ప్రజలు మద్యం సేవించి, బుల్లెట్ సైలెన్సర్ మార్చి నడపరాదని, వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


