కాకతీయ, బయ్యారంః మండలంలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించిన, మండల వ్యవసాయ అధికారి ఏవో రాంజీ గత మూడు రోజుల క్రితం ఐదు టన్నుల యూరియాను కొత్తపేట పంచాయతీ లోని దివ్య ఫెర్టిలైజర్ షాప్ కు అలాట్ చేయగా , వచ్చిన యూరియాను బుధవారం వ్యవసాయ అధికారులకు తెలియకుండా , 110 యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు తెలుసుకొని ,షాపును సీజ్ చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ షాపుకు వచ్చిన ,స్టాకు వివరాలు చెప్పకుండా, షాపుకు తాళం వేసి ,చరవాణి అధికారులకు అందుబాటులో లేకుండా ఉండడం, షాపు కు వచ్చిన యూరియా బ్లాక్ లో రైతులకు ఎక్కువ రేటుకు అమ్మకాలు జరిపినట్లు , స్థానికులు ఇచ్చిన సమాచారంతో, షాపుకు తాళం వేసి,సీజ్ చేసినట్లు ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఏఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


