epaper
Monday, March 2, 2026
epaper

జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలి

జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలి
బీజేపీపై భూక్య రాజేష్ నాయక్ తీవ్ర విమర్శలు
కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపణ
ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సర్వారం సర్పంచ్ అభ్యర్థి, సుజాతనగర్ మండల మాజీ పార్టీ అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఎన్నికల్లో సరైన నాయకత్వం చూపించలేదని ఒక ప్రకటనలో తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, కార్యవర్గ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడం, నిలబెట్టిన అభ్యర్థులకు కూడా పార్టీ నుంచి సరైన సహకారం అందించకపోవడం జరిగిందని ఆరోపించారు. ప్రచార సామాగ్రి అందించడంలో కూడా పార్టీ విఫలమైందని పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించారని విమర్శించారు. పార్టీకి కట్టుబడి పనిచేసిన కార్యకర్తలను పక్కనబెట్టి, పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ప్రచారం, ర్యాలీలు నిర్వహించకుండా అభ్యర్థులను ఒంటరిగా వదిలేశారని అన్నారు. పార్టీ ఫండింగ్ కూడా అభ్యర్థులకు పూర్తిస్థాయిలో అందకుండా చేయడం వల్ల ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నదని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలహీనపడడానికి జిల్లా అధ్యక్షుడి నాయకత్వ లోపమే ప్రధాన కారణమని విమర్శించారు. కనీసం అభ్యర్థులు డిపాజిట్ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ సహకారం లేకపోయినా కార్యకర్తలు కష్టపడి పోటీ చేశారని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. పార్టీ పునర్నిర్మాణం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం సర్పంచ్ అభ్యర్థి జర్పుల భీక్కులాల్ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img